అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు మృతి
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు మృతి చెందారు. రోహిత్ రెడ్డి కుటుంబ సభ్యులు కారులో వెళ్తుండగా భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రమాదం చోటు చేసుకుంది.
మృతులను తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకులపల్లికి చెందిన ప్రగతిరెడ్డి (35), ఆమె కుమారుడు అర్విన్ (6), అత్త సునీత (56)గా గుర్తించారు.