పూణే రేప్ ఘటనలో షాకింగ్ విషయాలు.. బస్సులో వందల సంఖ్యలో కండోమ్స్, లో దుస్తులు..
పూణే రేప్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు రాందాస్ యువతిపై అత్యాచారం చేసిన బస్సులో వందల సంఖ్యలో కండోమ్ లు, మహిళల లోదుస్తులను పోలీసులు గుర్తించారు.
దీంతో ఆ మానవ మృగం ఇంకా ఎంత మందిపై ఇలాంటి దారుణాలకు ఒడిగట్టాడో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటన జరిగిన బస్టాండ్ పోలీస్ స్టేషనుకు 100 మీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. నిందితుడి కోసం పోలీసులు డ్రోన్లు, డాగ్ స్క్వాడ్ల ద్వారా గాలిస్తున్నారు.