మూడేళ్లుగా అదే పని.. హార్డ్ డిస్కులో 499 నగ్న వీడియోలు
యువతుల ప్రైవేటు వీడియోల కేసులో మస్తాన్ సాయి అరెస్టైన విషయం తెలిసిందే. మస్తాన్ సాయి కస్టడీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడి హార్డ్ డిస్క్ 499 వీడియోలు, వేలకొద్దీ ఫొటోలు, ఆడియో కాల్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
యువతులు వీడియో కాల్స్ మాట్లాడినప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేసినవి, లావణ్యతో పాటు ఆమె ఫ్రెండ్స్ను లోబర్చుకున్నప్పుడు తీసిన వీడియోలు అందులో ఉన్నట్లు తేలింది. మూడేళ్లుగా అతడు వీటిని సేవ్ చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు.