ఐదుగురి ప్రాణాలు తీసిన ఆర్టీసీ బస్సు
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్లు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాండవుగల్ గ్రామ సమీపంలో అతివేగంగా వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు బైకులపై నుంచి దూసుకెళ్లడంతో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. గంగావతి డిపోకు చెందిన బస్ ఆదోని నుంచి రాయచూర్ కు వెళ్తూ ముందు వెళ్తున్న రెండు బైకులను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో మరణించగా మరికొందరికి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై డిఎస్పి మర్రిపాటి హేమలత, పెద్దతుంబలం పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.