లారీ డ్రైవర్ కిరాతకం, మంచం మీద నిద్రపోతున్న యువతిని..

Crime Published On : Sunday, September 1, 2019 01:40 PM

ఒక అనుమానం పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. అదే అనుమానం చివరికి కట్టు కున్న భార్యను అంతం చేసింది. వివరాలలోకి వెళితే విజయవాడ నిడమా నూరులో ఈ ఘటన జరిగింది. తుమ్మలపల్లి గ్రామానికి చెందిన సామియేల్‌ లారీ డ్రైవర్‌. మరదలు అశ్వినిని 2009లో వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. నాలుగేళ్లుగా దంపతుల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. తుమ్మలపల్లిలో ఉండగా నిత్యం గొడవలు జరుగుతుండడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. తర్వాత పిల్లల విద్య నిమిత్తం సామియేలు విజయవాడకు మకాం మార్చాడు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అశ్వినిపై మరింత అనుమానం పెంచుకున్నాడు సామియేలు. తాను ఫోన్‌ చేసిన ప్రతిసారీ అశ్విని ఫోన్‌ ఎంగేజ్‌ రావడంతో ఈ అనుమానం మరింత బలపడింది. మూడు రోజులుగా సామియేలు, అశ్వినిల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో జరిగిన విషయాన్ని అశ్విని తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పింది.
 
తాము వచ్చి అన్ని విషయాలు సర్దుబాటు చేస్తా మన్నారు. మూడు రోజు లుగా భార్యా భర్తలిద్దరూ ఎడ ముఖం పెడముఖంగానే ఉంటున్నారు. సామియేలు శుక్రవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాత్రికి వచ్చి పిల్లలను తీసుకెళడానికి ప్రయత్నించాడు. దీనికి ఇంటి యజమాని అభ్యంతరం చెప్పాడు. పెద్దలతో మాట్లాడు కున్న తర్వాత తీసుకెళ్లాలని చెప్పడంతో తిరిగి వెళ్లిపోయాడు. రాత్రంతా ఓ పెట్రోలు బంకులో నిద్రపోయాడు. శనివారం ఉదయం ఆరు గంటలకు తిరిగి ఇంటికొచ్చి తలుపులు కొడుతున్నా అశ్విని తీయలేదు. పక్కనే ఉంటున్న ఇంటి యజమాని భార్య విజయలక్ష్మి ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో పని చేయడానికి వెళ్తోంది. ఎంత కొట్టినా తలుపు తీయడం లేదని ఆమెకు చెప్పాడు. ఇంకాస్త గట్టిగా తలుపు కొట్టమని విజయలక్ష్మి చెప్పింది. సా మియేలు గట్టిగా కొట్టడంతో అశ్విని తలుపులు తీసింది. లోపలకు వెళ్లిన సామియేలు కాసేపటికి మంచంపై నిద్రపోతున్న అశ్వినిని తలపై పచ్చడి బండతో మోది చంపేశాడు. అనంతరం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అత్త మామలకు ఫోన్‌ చేసి అశ్విని చనిపోయిందని చెప్పాడు. అనంతరం పటమట పోలీసు స్టేషన్‌కు వెళ్లి చెంపపై కొడితే తన భార్య చనిపోయిందని చెప్పిలొంగి పోయాడు. అశ్విని మరణవార్త తెలియడంతో ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన ఇక్కడికి వచ్చారు. అనుమానంతోనే సామియేలు తమ కుమార్తెను హత్యచేశాడంటూ అశ్విని తండ్రి మండా ప్రసాద్‌ కన్నీరు మున్నీరయ్యారు. ఘటనా స్థలాన్ని పటమట ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావు పరిశీలించారు. మృతురాలి తండ్రి ప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.