పోసాని రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
వైసిపి మద్దతుదారు, సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లాకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. పోలీసులు పోసానిపై దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించారు. పోసాని దారుణమైన వ్యాఖ్యలు చేశారని, అసభ్య పదజాలంతో దూషించారని పేర్కొన్నారు.
పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులున్నాయని, సినీ రంగానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన వ్యాఖ్యలు చాలామందిపై ప్రభావం చూపుతాయని తెలిపారు. సమాజంలో విభజన, ఉద్రిక్తతలు తెచ్చేలా ఆయన మాట్లాడారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.