తాత అవమానించాడని.. 72 సార్లు కసితీరా పొడిచి చంపేశా
పారిశ్రామిక వేత్త జనార్ధన్ రావు హత్య కేసులో పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడు కీర్తి తేజ పలు షాకింగ్ విషయాలు వెల్లడించాడు. తనను తాత చిన్న చూపు చూసేవాడని, ఆఫీసులో అందరి ముందు తిట్టడంతో కోపం పెంచుకున్నట్లు తెలిపాడు.
ఆస్తి పంపకాల్లో కూడా తనకు ఆస్తి ఇవ్వడం కుదరదని చెప్పడంతో చంపేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. ఈ క్రమంలోనే ఆన్లైన్లో కత్తి కొనుగోలు చేసి 72 సార్లు కసి తీరా పొడిచి చంపినట్లు ఒప్పుకున్నాడు.