ఘోరం: ప్రాణాలు కోల్పోయిన 1000 మంది
సిరియాలో భద్రతా బలగాలు, మాజీ అధ్యక్షుడు బషర్ అసద్ మద్దతుదారుల మధ్య యుద్ధం కొనసాగుతోంది. దీంతో మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 1000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
మృతుల్లో 745 మంది సాధారణ పౌరులు ఉండగా 148 మంది మిలిటెంట్లు, 125 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. ఘర్షణలు ఉదృతంగా ఉన్న లటాకియా నగరంలో విద్యుత్, తాగునీటి సరఫరా నిలిపివేశారు. బషర్ నుంచి తిరుగుబాటుదారులు అధికారం దక్కించుకున్న 3 నెలల తర్వాత ఈ ఘర్షణలు మొదలయ్యాయి.