కసాయి తండ్రి: కన్న కూతురిపై లైంగిక దాడి

Crime Published On : Wednesday, March 12, 2025 02:00 PM

కన్న తండ్రే కసాయిగా మారి కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అమానవీయ ఘటన రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న ఓ బాలిక(15) మంగళవారం డల్ గా ఉండటంతో టీచర్ ఓదార్చుతూ ఏమైందని అరా తీసింది. దీంతో తండ్రి రాక్షసకాండను ఆ బాలిక బయట పెట్టింది.

భార్యా భర్తల మధ్య విభేదాలతో బాధితురాలి తండ్రి వద్ద నుంచి తల్లి తన ముగ్గురు కుమార్తెలతో 8ఏళ్ల కిందట పుట్టింటికి వెళ్లింది. మూడేళ్లుగా పెద్ద కుమార్తె తండ్రి వద్ద ఉంటుండగా ఈ అఘాయిత్యం చోటు చేసుకుంది. కూతురిపై లైంగిక దాడికి పాల్పడుతున్న ఆ తండ్రిపై రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...