మర్మాంగాలకు డంబెల్స్ వేలాడదీసి.. ఇలా తయారయ్యరెంట్రా
మర్మాంగాలకు డంబెల్స్ వేలాడదీసిన అమానవీయ ఘటన కేరళ కొట్టాయం నర్సింగ్ కాలేజీలో చోటు చేసుకుంది. తిరువనంతపురానికి చెందిన ముగ్గురు ఫస్టియర్ స్టూడెంట్స్ను ఐదుగురు థర్డ్ ఇయర్ సీనియర్లు ర్యాగింగ్ చేశారు. బట్టలిప్పించి వారి మర్మాంగాలకు డంబెల్స్ వేలాడదీశారు.
అక్కడితో ఆగకుండా గాయాలకు కెమికల్స్ పూశారు. నొప్పి భరించలేక అరుస్తుంటే నోట్లోనూ స్ప్ర్పే చేశారు. డబ్బులు దోచుకున్నారు. చంపేస్తామని బెదిరించినా తట్టుకోలేని స్టూడెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.