కన్న తండ్రిని రంపంతో కోసి చంపి.. ముక్కలుగా నరికి.. ఏపీలో దారుణం

Crime Published On : Friday, February 28, 2025 03:00 PM

ప్రకాశం జిల్లాలోని దొనకొండ మండలం ఇండ్ల చెరువు గ్రామానికి చెందిన పైడిపోగు ఏసు (79) రైల్వేలో గ్యాంగ్‌మన్‌గా పనిచేసి రిటైర్డ్‌ అయ్యారు. ఆయనకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య పదేళ్ల క్రితం చనిపోవడంతో గ్రామంలోని చిన్న కుమారుడైన మరియదాసు వద్ద ఉంటున్నారు. మరియదాసు రోజూ మద్యం తాగి వస్తుండడంతో భార్య శాంతకుమారి గొడవపడి ఇద్దరు కుమార్తెలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది.

దాంతో మద్యం తాగడం మరింత ఎక్కువ అయింది. డబ్బుల కోసం తండ్రిని వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 9న రాత్రి మద్యంతాగి వచ్చిన మరియదాసు తెల్లవారుజామున చుట్టుపక్కల ఇళ్లలో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో తండ్రిని హతమార్చాడు. చెట్టును కోసే రంపంతో తండ్రి తల, మొండెంను కోసి వేయడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. కన్న కొడుకే తండ్రిని రంపంతో కోసి చంపేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఎంత తాగినా కన్నతండ్రిని ఇంత దారుణంగా ఎలా చంపగలిగాడన్నది ఎవరికీ అర్థం కాకుండా పోయింది. 

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...