అంత్యక్రియలకు డబ్బులేక.. వారం రోజులు తల్లి శవంతో ఇంట్లోనే ఉన్న కూతుళ్ళు

Crime Published On : Saturday, February 1, 2025 09:00 AM

తల్లి మృతి చెందినా వారం రోజులుగా మృతదేహంతో కూతుళ్లు గడిపిన విషాద సంఘటన సికింద్రాబాద్ వారాసిగూడలో చోటు చేసుకుంది. అనారోగ్యంతో తల్లి శ్రీలలిత (45) మృతి చెందింది. తల్లి మృతదేహంతో కూతుళ్లు రవళిక (25), అశ్విత (22) ఇంట్లో వారం రోజులుగా ఉన్నారు. దహన సంస్కారాలకు డబ్బుల్లేక మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్నట్లు తెలుస్తోంది.

దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఒక గదిలో తల్లి మృతదేహం ఉంచి మరో గదిలో తాము ఉంటున్నామని కూతుళ్లు జవాబిచ్చారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు.