తల్లిని బలవంతగా ఎత్తుకెళ్ళిన కూతురి లవర్.. ఆ మరుసటి రోజే..
ఏపీలోని విజయనగరం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. శృంగవరపుకోట మండలం వెంకటరమణపేటలో తల్లి కూతుర్లిద్దరూ ఆటోలో ప్రయాణిస్తుండగా కూతురి ప్రియుడు వచ్చి తల్లిని బలవంతగా ఎత్తుకెళ్లాడు. మరునాడు ఆమె వెంకటరమణపేటలోని ఓ బావిలో శవమయి కనిపించింది.
అయితే తన ప్రేమకు తల్లి అడ్డుగా ఉందని ప్రియుడితో కలిసి కూతురు తల్లిని హత్య చేయించినట్లు అక్కడి స్థానికులు తెలిపారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.