ముఖంపై మూత్రం పోసి, గ్యాంగ్ రేప్.. బీజేపీ ఎమ్మెల్యేపై కేసు
బీజేపీ ఎమ్మెల్యేపై మహిళ సంచలన ఆరోపణలు చేసింది. మహిళా కార్యకర్తపై కర్కషంగా వ్యవహరించాడని ఓ బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసింది. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు బాధిత మహిళ చేసింది. ఎమ్మెల్యే మునిరత్న ఆమె ముఖంపై మూత్ర విసర్జన చేశాడని, డేంజరస్ వైరస్ ఇంజక్షన్ చేశాడని, సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు 40ఏళ్ల బీజేపీ కార్యకర్త ఆరోపించింది. ఆమె ఫిర్యాదుతో బెంగళూరులోని RMC యార్డ్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు.