కూతురికి కన్యాదానం చేసి.. మండపంలోనే..
పెళ్లి మండపంలోనే వధువు తండ్రి గుండెపోటుతో కుప్పకూలిన ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. జిల్లాలోని బిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లికి చెందిన బాలచంద్రం (56) తన కుమార్తెకు వివాహం జరిపిస్తున్నారు.
ఈ క్రమంలో అల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం పూర్తి చేసి మండపంలోనే కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించి వైద్యులు పరీక్షించేలోపే ఆయన మృతి చెందారు. ఇదే జిల్లాలో శుక్రవారం పదో తరగతి అమ్మాయి కూడా గుండెపోటుతో మృతి చెందింది.