విశాఖలో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారయత్నం

Crime Published On : Saturday, March 15, 2025 12:23 PM

విశాఖపట్నం పరిధిలోని గాజువాకలో దారుణం చోటు చేసుకుంది. పదేళ్ల మైనర్ బాలికపై ఓ నరరూప రాక్షసుడు అత్యాచారయత్నం చేశాడు. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధి డ్రైవర్స్ కాలనీలో పది ఏళ్ల బాలికపై భాను ప్రకాష్ అత్యాచారానికి పూనుకున్నాడు. తల్లిదండ్రులు కూలి పనికి వెళ్లడంతో, ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.

మద్యం మత్తులో బాను ప్రకాష్ అత్యాచారయత్నం చేసినట్టు సమాచారం. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడు బాను ప్రకాష్ ను గాజువాక పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.

సోఫియా అన్సారీ హాట్ ఫోటోస్

See Full Gallery Here...