కూటమి నేతల టార్చర్ భరించలేక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య
ఏపీలో కూటమి నేతల బెదిరింపులు భరించలేక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య చేసుకున్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం పాపిశెట్టిపాలెంకు చెందిన షేక్ ఫాతిమా బేగం (35) అంగన్వాడీ టీచర్ గా పని చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమెను అంగన్వాడీ టీచర్ పోస్టు నుంచి తొలగించి, తమ వారిని నియమించుకుంటామని కూటమి నేతలు బెదిరించినట్లు ఫాతిమాబేగం కుటుంబీకులు తెలిపారు. గడ్డి మందు తాగి ఫాతిమాబేగం ఆత్మహత్య చేసుకోగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.