వైస్ ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థిని ఆత్మాహత్యాయత్నం
వైస్ ప్రిన్సిపల్ వేధింపులతో స్కూలు విద్యార్థిని ఆత్మాహత్యాయత్నం చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్తగడి రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న 5వ తరగతి విద్యార్థిని భవనం మొదటి అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. బాధితురాలిని 5వ తరగతి చదివే తబితగా గుర్తించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. పాఠశాల వైస్ ప్రిన్సిపల్ వేధిస్తుండటంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని పాఠశాల భవనం పైనుంచి దూకినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.