లోయలో పడిన బస్సు.. 51 మంది మృతి

Crime Published On : Tuesday, February 11, 2025 08:50 AM

ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ 20 అడుగల లోయలో పడిపోయి 51 మంది ప్రయాణికులు మృతి చెందిన విషాద ఘటన గ్వాటెమాల దేశంలో చోటు చేసుకుంది. అధికారుల వివరాల ప్రకారం సోమవారం (ఫిబ్రవరి 10) ప్యూంటె బెలిస్ వంతెనపై నుంచి ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. బస్సు లోయలో పడిపోవడంతో అందులోని 51 మంది ప్రయాణికులు జల సమాధి అయ్యారు. 

సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గ్యాటెమాల రెస్య్కూ బృందాలు, సైన్యం సహయక చర్యల్లో పాల్గొంది. ఈ దుర్ఘటనపై గ్వాటెమాల అధ్యక్షుడు బెర్నార్డో అరెవాలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంఘీభావంగా మూడు రోజుల పాటు జాతీయ సంతాప దినాలు ప్రకటించారు. ఘటన స్థలంలో యుద్ధ ప్రాతిపదికన సహయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...