కల్తీ మద్యం తాగి 14 మంది మృతి
పంజాబ్ లోని అమృత్ సర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి 14 మంది మృతి చెందారు. పలువురు అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించారు. కల్తీ మద్యం బాధితుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నలుగురిని అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు ప్రభ్ జిత్ పరారీలో ఉన్నాడు. ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.