జనవరి 1 నుంచి ఇలాంటి బ్యాంక్ అకౌంట్లు క్లోజ్

Business Published On : Tuesday, December 31, 2024 01:01 PM

జనవరి 1, 2025 నుంచి బ్యాంకింగ్ కార్యకలాపాల్లో లోపాలను పరిష్కరించడానికి మరియు స్కామ్ లను అరికట్టడానికి ఆర్బీఐ కీలక మార్పులు చేస్తోంది. ఇందుకోసం పలు రకాల బ్యాంకు ఖాతాలను మూసివేయనుంది.

ఇనాక్టివ్ అకౌంట్లు: ఒక సంవత్సరం పాటు ఉపయోగంలో లేని బ్యాంకు ఖాతాలు
డార్మాంట్ అకౌంట్లు: రెండేళ్ల పాటు ఎలాంటి లావాదేవీలు జరగని ఖాతాలు
జీరో బ్యాలెన్స్ అకౌంట్లు: వివిధ బ్యాంకులను బట్టి ఎక్కువ కాలం జీరో బ్యాలెన్స్ కొనసాగిస్తున్న బ్యాంకు ఖాతాలు