Amazon Web: తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడులు

Business Published On : Sunday, December 6, 2020 01:00 PM

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తెలంగాణలో భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది. రికార్డు స్థాయిలో రూ. 20 వేల 761కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. 2022 నాటికి హైదరబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్‌ను ప్రారంభించనుందని తెలంగాణా ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.  పలు చర్చల తర్వాత ఏవీఎస్ పెట్టుబడులకు ముందుకు వచ్చిందనీ,  మల్టిపుల్ డేటా సెంటర్లను అమెజాన్ ఏర్పాటు చేయనుందని వెల్లడించారు. ఇదే అతిపెద్ద ఎఫ్‌డీఐ ఇన్వెస్ట్‌మెంట్ అంటూ  కేటీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు.

దూసుకుపోతున్న రిల్ 
ఇక రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు భారీ లాభాలను నమోదు చేస్తోంది.  రిల్ సంస్థకు చెందిన రీటైల్‌ విభాగం రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో  సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్(పీఐఎఫ్‌) 9,555 కోట్ల రూపాయలు పెట్టుబడుల నేపథ్యంలో ఇన్వెస్టర్లకు కొనుగోళ్లకు  క్యూకట్టారు.  దీంతో  మార్కెట్ ట్రేడింగ్‌ ఆరంభంలోనే  హై జంప్‌ చేసిన  రిలయన్స్‌  షేరు ప్రస్తుతం 4 శాతం లాభాలతో కొనసాగుతోంది. మరోఆల్‌టైం గరిష్టం వైపు దూసుకుపోతోంది.  (ముకేశ్‌.. మారథాన్‌!)
 
బిలియనీర్ ముకేశ్‌ అంబానీ నేతృత‍్వంలోని రిటైల్ విభాగం 2.04 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. దీని విలువ రూ .9,555 కోట్లు.  గత రెండు నెలల్లో మొత్తం నిధుల సేకరణ 47,265 కోట్ల రూపాయలకు చేరుకుంది.  మరోవైపు సెన్సెక్స్ 346 పాయింట్లు లాభంతో 41688 వద్ద, నిఫ్టీ 87 పాయింట్లుఎగిసి 12207 వద్దకొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో  ట్రేడ్‌ అవుతున్నాయి.

ఆన్ లైన్ ఫార్మసీ 1ఎంజీపై టాటా గ్రూప్ కన్ను
ఆన్ లైన్ ఫార్మసీ కంపెనీ 1ఎంజీలో మెజారిటీ వాటా కొనుగోలుకి పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ చర్చలు నిర్వహిస్తున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. తద్వారా ఈ విభాగంలో ప్రధాన కంపెనీలైన మెడ్ ప్లస్, నెట్ మెడ్స్, ఫార్మీజీ, 1ఎంజీ మధ్య పోటీ తీవ్రతరం కానున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే నెట్ మెడ్స్ ప్రమోటర్ కంపెనీ విటాలిక్ లో రిలయన్స్ రిటైల్ 60 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఇదేవిధంగా క్లౌడ్ టెయిల్ తో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. క్లౌడ్ టెయిల్లో అమెజాన్ 24 శాతం వాటా పొందింది. కాగా.. సీక్వోయా క్యాపిటల్ దన్నుగా సేవలందిస్తున్న 1ఎంజీ ఇటీవల 10 కోట్ల డాలర్ల(రూ. 740 కోట్లు) సమీకరణకు సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది. ఇవి ఫలించనట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి.