ఆకట్టుకునే ఫీచర్లతో మోటో జీ9 పవర్ 

Tuesday, January 19, 2021 03:15 PM Technology
ఆకట్టుకునే ఫీచర్లతో మోటో జీ9 పవర్ 

ప్రముఖ మొబైల్ దిగ్గజం మోటో జీ9 పవర్ మొబైల్ ను డిసెంబర్ 8న భారతదేశంలో తీసుకురానున్నట్లు తెలిపింది. ట్విట్టర్ లో ‘మోటోరోలా నుండి మరో కొత్త ఫోన్ రాబోతుంది. దాని పేరు మోటో జీ9 పవర్. డిసెంబర్‌ 8, మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ వేదికగా మొబైల్‌ లాంచ్‌ అవుతోంది. అప్పటి వరకు వేచి చూడండి’అని మోటోరోలా తన ట్విట్టర్ పేజీలో తెలిపింది. దీనికి సంబందించిన కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా షేర్ చేసింది. కాగా ఈ మొబైల్‌ను ఇప్పటికే యూరప్‌లో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌ ధర రూ.17,400 (199 యూరోలు) అని తెలుస్తోంది.

మోటో జీ9 పవర్ ఫీచర్స్:
మోటో జీ9 పవర్ ఆండ్రాయిడ్ 10పై నడుస్తుంది. దీనిలో 6.8-అంగుళాల హెచ్‌డి + (720x1,640 పిక్సెల్స్)ఐపిఎస్ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్ తో పనిచేస్తుంది. దీనిలో స్టోరేజ్ వచ్చేసి 128జీబీ, మైక్రో ఎస్ డీ కార్డ్ ద్వారా 512GB వరకు విస్తరించుకోవచ్చు. మోటో జీ9 పవర్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో ఎఫ్/1.79 లెన్స్‌తో, 2 మెగాపిక్సెల్ కెమెరా ఎఫ్/2.4 లెన్స్‌తో  మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ కెమెరా ఎఫ్/2.4 లెన్స్‌తో కలిగి ఉంది. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఎఫ్/2.2 ఎపర్చర్‌తో వస్తుంది.

మోటరోలా మోటో జీ9 పవర్‌ను 20వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని తీసుకొచ్చారు. కనెక్టివిటీ ఎంపికలలో వై-ఫై 802.11 ఎసి, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి, 3.5 ఎంఎం ఆడియో జాక్ మరియు 4జీ ఎల్‌టిఇ ఉన్నాయి. ఫోన్ బరువు 221 గ్రాములు మరియు 9.66 మిమీ మందంగా ఉంటుంది. ఈ ఫోన్‌ ఎలక్ట్రిక్‌ వయిలెట్‌, మెటాలిక్‌ సేజ్‌ రంగుల్లో లభిస్తుంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!