షాకింగ్ న్యూస్: పోలీస్ కాళ్లు మొక్కిన వైసీపీ ఎమ్మెల్యే (వీడియో)..!

Wednesday, April 1, 2020 06:52 PM Politics
షాకింగ్ న్యూస్: పోలీస్ కాళ్లు మొక్కిన వైసీపీ ఎమ్మెల్యే (వీడియో)..!

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టులు మాత్రం విధులు నిర్వర్తిస్తున్నారు. డాక్టర్లు ఏకంగా తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా కరోనా రోగులకు ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. ఇక పోలీసులు మండుటెండలో నిలబడి డ్యూటీ చేస్తూ కరోనా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అవసరమైతేనే రోడ్ల మీదకు రావాలంటూ వాహనదారులను కోరుతున్నారు. విపత్కర సమయంలో పోలీసులు చేస్తున్న పనిని అందరూ అభినందిస్తున్నారు. కుటుంబానికి దూరంగా ఉంటూ, ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న ఖాకీలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ క్రమంలో విశాఖపట్టణంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న పోలీసుకు వైసీపీకి చెందిన అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌కి పాదాభివందనం చేసి, ఆయన చేస్తున్న సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. ఎమ్మెల్యే పాదాభివందనం చేయడంతో సదరు పోలీస్ కూడా గౌరవసూచకంగా ఎమ్మెల్యే కి సెల్యూట్ చేశారు. కరోనాను కట్టడి చేసేందుకు వైద్యులతో పాటు పోలీసులు కూడా ఎంతో శ్రమిస్తున్నారని వారికి సహకరించాలని ఎమ్మెల్యే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనాకు మందు లేదని సామాజిక దూరం పాటించడమే మన దగ్గరున్న ఏకైక ఆయుధమని ఆయన అన్నారు. కాగా, పోలీస్ కాళ్లు మొక్కిన వైసీపీ ఎమ్మెల్యే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: