18 కేసుల్లో స్టేతో పత్తిగింజని అంటున్నాడు

Tuesday, September 10, 2019 09:48 AM Politics
18 కేసుల్లో స్టేతో పత్తిగింజని అంటున్నాడు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలపై వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. బాసు ఏమో 18 కేసుల్లో స్టేలు తెచ్చుకుని తాను పత్తిగింజనని చెప్పుకుంటాడని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఆయన బానిసలు ఏమో పోలీసులకు కూడా దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. పేదలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తే ఇలాంటి వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడుపుటలా ఇసుక బొక్కినవాళ్లకు రేషన్ బియ్యం నాణ్యత ఏం తెలుస్తుందని చురకలు అంటించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: