మహానాడు లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అమలు చేసే పథకాల ప్రకటన
రాజమండ్రి వేదికగా TDP మహానాడును జరుపుకొంటోంది. ఇవ్వాళ రెండో రోజు. పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శతజయంతి కూడా తోడుకావడంతో ఇవ్వాళ్టి కార్యక్రమాలను మరింత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. పలు కీలక తీర్మానాలను ఆమోదించనుంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం తన ముగింపు సభలో పలు కీలక అంశాలను ప్రకటించారు .
1) ఆడబిడ్డ నిధి:-18 ఏళ్లు నిండిన మహిళలు – నెలకు రూ.1500 ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు
2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు
3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం
4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం
5. యువగళం:-యువగళం విన్నాం - 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు
– యువగళం నిధి కింద నెలకు రూ.3000
6.అన్నదాత-అన్నదాతకు ఏడాదికి రూ. 20 వేలు.
7. రాష్ట్రం లో ఇంటింటికి మంచినీరు
8. బిసిలకు రక్షణ చట్టం
9. పూర్ టు రిచ్:-పేదలను సంపన్నులు చేస్తాం- ఆదాయం రెట్టింపు చేస్తాం.