గెట్ రెడీ జగన్ : టీడీపీ రెడీ చేసిన మరో పిటీషన్, హైకోర్ట్ లో వార్ వన్ సైడేనా..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తోన్న తెలుగుదేశం పార్టీ మరోమారు హైకోర్టు తలుపు తట్టడానికి రెడీ అవుతున్నారు. 90% కేసుల్లో తీర్పులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తాజా పిటీషన్పైనా కూడా జగన్ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి మొట్టికాయలు తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వస్తున్నాయి.
ఈ పిటీషన్ విషయంలో టీడీపీకి అండగా బీజేపీ కూడా నిల్చునే అవకాశం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన నిరర్ధక ఆస్తులను ఆన్లైన్ ద్వారా విక్రయిండానికి టీటీడీ పాలక మండలి అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ తెలుగుదేశం, బీజేపీ నాయకులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయవచ్చని తెలుస్తోంది.
పాలక మండలి తీసుకున్న నిర్ణయం చట్టవ్యతిరేకమని ఇప్పటికే ఈ రెండు పార్టీలతో పాటు జనసేన నాయకులు నిప్పులు చెరుగుతోన్న విషయం తెలిసిందే. కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయం కావడం వల్ల వైఎస్ జగన్ ప్రభుత్వంపై మతపరమైన రంగును పూయడానికీ ఈ అంశం ఉపకరిస్తోందని టీడీపీ, బీజేపీ నాయకులు భావిస్తున్నట్లు చెబుతున్నారు.