ఉత్తర కొరియా కొత్త అధ్యక్షుడు ఇతనే..!

Wednesday, April 29, 2020 01:30 PM Politics
ఉత్తర కొరియా కొత్త అధ్యక్షుడు ఇతనే..!

ఉత్తర కొరియా నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన సమాచారం ఇప్పటివరకు లేనందున తరువాతి అధ్యక్షుడు ఎవరనే విషయంపై చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి. కిమ్‌ చిన్న చెల్లెలు కిమ్‌ యో జంగ్ ఆ పదవికి‌ సమర్థురాలిగా పలు కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే పురుషాధిక్యత కలిగిన ఉత్తర కొరియా లాంటి సమాజంలో ఒక మహిళకు అంతటి అధికారం అప్పగిస్తారా అన్నది అనుమానమేనన్న విశ్లేషణలు కూడా వినబడుతున్నాయి.

ఈ నేపథ్యంలో కిమ్‌ చిన్నాన్న కిమ్‌ ప్యాంగ్‌ ఇల్‌ (65) పేరు బయటికొచ్చింది. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్‌ ఇల్‌ సంగ్‌ వారసుల్లో ప్యాంగ్‌ ఇల్ (కిమ్‌ చిన్నాన్న)‌ చివరివాడు. ఉత్తర కొరియా తదుపరి అధ్యక్షుడిగా ఆయనకే అన్ని అర్హతలు ఉన్నాయని ఆ దేశంలోని కొందరు మేధావులు తమ అభిప్రాయన్ని చెప్పారు. ఆయన చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. దాదాపు నలభై ఏళ్ల అనంతరం రాజకీయంగా ఆయన పేరు వినిపిస్తుండటం గమనార్హం.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: