తెలంగాణ ఎన్నికలు-లగడపాటి సర్వే

Wednesday, December 5, 2018 12:11 PM Politics
తెలంగాణ ఎన్నికలు-లగడపాటి సర్వే

37 నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని తన ఆర్జీ టీమ్ సర్వేలో తేలినట్లు లగడపాటి పేర్కొన్నారు.  ‘క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోలా ఉన్నాయి రాజగోపాల్.. డిసెంబర్ 11న ఏది నిజమో మీకే తెలుస్తుంది’ అంటూ కేటీఆర్ తనకు సవాల్ విసిరారని అన్నారు. వాస్తవం చేదుగా ఉంటే తనపై కోప్పడితే ఎలాగని ప్రశ్నించారు.

కేటీఆర్ బాధపడతారని ‘తెలంగాణ ఎన్నికల్లో మొత్తం సీట్లు ఎన్ని వస్తాయో నేను చెప్పలేను. మీరు బాగా కష్టపడుతున్నారు. మీ నాన్నగారు వాతావరణాన్ని కొంచెం పాడు చేశారు. నువ్వు ఇప్పుడు పరిస్థితి చక్కదిద్దుతున్నావు’ అని మెచ్చుకునాన్నని అన్నారు.