మీరు అధైర్యపడొద్దు, మీకు నేనున్నా.

Wednesday, April 1, 2020 07:58 AM Politics
మీరు అధైర్యపడొద్దు, మీకు నేనున్నా.

కరోనావైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే అమెరికాలో మరణాల సంఖ్యతో పాటు కరోనావైరస్ పాజిటివ్ కేసులు కూడా విపరీతంగా పెరిగిపోతుండటంతో అందరిలో ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాలో ఇప్పటి వరకు 3వేల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. ఇక 1,67,000కు పైగా కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజున మాత్రమే 540 మంది మృతి చెందినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే అమెరికాలో తెలుగురాష్ట్రాలకు చెందిన ప్రజలు కూడా ఇరుక్కుపోవడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ధైర్యం చెబుతున్నాయి.

ఏపీ ప్రభుత్వం అక్కడి ఏపీ ప్రజలకు భరోసా ఇస్తోంది.అగ్రరాజ్యం అమెరికాలో ప్రవాసాంధ్రులు తల్లడిల్లుతున్నారు. అక్కడ ఉన్న ప్రవాసాంధ్రుల్లో మనోధైర్యం నింపుతూ ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్‌లో వీడియో సందేశం ఏర్పాటు చేశారు. అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్‌ పండుగాయల ఏర్పాటు చేసిన ఈ వీడియో సందేశంలో ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నారైలకు భరోసానిచ్చారు.  మీరు అక్కడ సురక్షితంగా, జాగ్రత్తగా ఉండండి, ఏపీలోని మీ కుటుంబసభ్యుల పట్ల మేం జాగ్రత్త వహిస్తాం అంటూ వైఎస్‌ జగన్‌ ఇచ్చిన భరోసాను వీడియో సందేశం రూపంలో ఉంచారు.

 ఏపీలో ఉన్న మీ కుటుంబసభ్యుల గురించి కలత చెందవద్దు. మా ప్రభుత్వం వారి ఆరోగ్య పరిరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. కోవిడ్‌– 19 నివారణకు ప్రభుత్వ యంత్రాంగం అంతా నిరంతరం శ్రమిస్తోంది.

 ఎక్కడ ఏ చిన్న ఘటన వెలుగులోకి వచ్చినా ప్రభుత్వం వెంటనే స్పందించి ఉత్తమ వైద్యం అందిస్తోంది. తమ వారి కోసం ప్రవాసాంధ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

For All Tech Queries Please Click Here..!
Topics: