గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలో తప్పు జరిగితే, తోలు తీసేలా కొత్త రూల్స్ తెచ్చిన జగన్..!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వలంటీర్లు, గ్రామ/వార్డు స్థాయి సచివాలయాలు. రాష్ట్ర చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడూ లేనివిధంగా ఈ రెండు వ్యవస్థలను సృష్టించారు. వీటి వలన జిల్లాస్థాయి పరిపాలనా కార్యకలాపాలను గ్రామస్థాయికి తీసుకెళ్లారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు మరింత చేరువ చేశారు ఈ రెండు వ్యవస్థల వల్ల. దీనివల్ల రెండున్నర లక్షలమంది నిరుద్యోగులకు ఉపాధిని సైతం కల్పించినట్టయింది. కొన్నిచోట్ల అలాంటి వ్యవస్థలు కట్టు తప్పుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు గ్రామవలంటీర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే వార్తలు ఈ మధ్యకాలంలో అధికంగా వస్తున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. వాటిని పర్యవేక్షించడానికి ఐఎఎస్ స్థాయి అధికారిని నియమించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసం ఓ ప్రత్యేకంగా జిల్లాస్థాయిలో జాయింట్ కలెక్టర్‌కు ఈ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించబోతున్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జాయింట్ కలెక్టర్ల సంఖ్యను పెంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఒక్కో జిల్లాకు ఇద్దరు జాయింట్ కలెక్టర్లు పనిచేస్తున్నారు. ఈ సంఖ్యను మూడుకు పెంచబోతోంది ప్రభుత్వం. కొత్తగా మరో జాయింట్ కలెక్టర్ పోస్టును సృష్టించనుంది. గ్రామ/వార్డు సచివాలయాల పరిపాలన, వలంటీర్ల వ్యవస్థను పర్యవేక్షించడానికి ఇకపై ఒక్కో జిల్లాలో ముగ్గురు జాయింట్ కలెక్టర్లు పని చేసేలా చర్యలను తీసుకోనుంది.