కరోనా కట్టడకి ఏపీ సీఎం మరో సంచలన నిర్ణయం!
కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో ప్రభుత్వం నిర్ణయాలు వేగంగా అమలు చేయడానికి జిల్లాకో సీనియర్ అధికారిని ఏపీ ప్రభుత్వం నియమించింది. జిల్లాకో ఐఏఎస్ అధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఆయా జిల్లాలకు వెళ్లాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఏపీలో మొత్తం 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు కొత్తగా ఇద్దరికి కరోనా సోకినట్టు నిర్ధారించారు. అందులో ఒకరు విశాఖపట్నానికి చెందిన వారు. ఇటీవల బర్మింగ్ హామ్ వెళ్లి వచ్చి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తికి పేషెంట్ నెంబర్ 12 బంధువు.
ఇక పేషెంట్ నెంబర్ 13 గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఇటీవల ఢిల్లీ వెళ్లి కరోనా బారిన పడిన వ్యక్తికి ఈమె బంధువు. ఈ రోజు కొత్తగా 53 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో ఇద్దరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. 51 మందికి నెగిటివ్ రిపోర్టులు వచ్చాయి.
ఐఏఎస్ అధికారుల వివరాలు.
శ్రీకాకుళం - ఎంఎం నాయక్
విజయనగరం - వివేక్ యాదవ్ విశాఖ - కాటంనేని భాస్కర్
తూర్పు గోదావరి - బి.రాజశేఖర్
పశ్చిమగోదావరి - ప్రవీణ్ కుమార్
కృష్ణా - సిద్దార్థ్ జైన్గుంటూరు - కాంతిలాల్ దండే
ప్రకాశం - ఉదయ లక్ష్మి
నెల్లూరు - బి.శ్రీధర్
కర్నూలు - పీయూష్ కుమార్
కడప - శశిభూషన్ కుమార్
అనంతపురం - భాస్కరరావు నాయుడు
చిత్తూరు - రాంగోపాల్