సీఎం జగన్‌కు ప్రధాని ఫోన్‌, ముఖ్యమంత్రి వినతి.

Monday, April 6, 2020 08:15 AM Politics
సీఎం జగన్‌కు ప్రధాని ఫోన్‌,  ముఖ్యమంత్రి వినతి.

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారికి ఫోన్‌ చేశారు. కోవిడ్‌–19 నియంత్రణ చర్యలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. వైరస్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడానికి గల కారణాలను జగన్ ప్రధానికి వివరించారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని కూడా వైఎస్‌ జగన్‌ ప్రధానికి ఈ సందర్భంగా తెలిపారు. కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై ఇటీవలే లేఖ రాసిన విషయం గుర్తుచేశారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రావాల్సిన రూ.2,100 కోట్లు, పౌర సరఫరాల శాఖకు సంబంధించి రూ.2,200 కోట్లు.. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు స్థానిక సంస్థలకు రూ.1,100 కోట్లు, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు రూ.1,050 కోట్లు, జీఎస్టీ పరిహారం కింద రూ.900 కోట్లు ఇప్పించాల్సిందిగా ప్రధానిని వైఎస్‌ జగన్‌ కోరారు. దీనిపై ప్రధాని సానుకూలంగా స్పందిస్తూ.. లేఖలోని అంశాలు తన దృష్టికి వచ్చాయని, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: