మహారాష్ట్ర రాజకీయంలో.. మహా మలుపు..
గత కొంతకాలంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలకి తెరదించుతూ ఈ రొజు సాయంత్రం 08:30 లోపు ప్రభుత్వ ఏర్పాటు కి NCP తో సహ ఏ పార్టి ముందుకి వచ్చే పరిస్తితి లేకపోవడం తో గవర్నర్ రాష్ట్రపతి పాలన కి రికమెండ్ చేసినట్టు తెలుస్తుంది. దీనిపై సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈపాటికే రాష్ట్రపతి పాలన దిశగా నిర్ణయం తీసుకుంది. ఇక అధికారికంగా బహుశా రాష్ట్రపతి పాలన ఎన్ని రోజులు విధించాలి ఎంటీ అనే దానిపై రాష్ట్రపతి భవన్ నుండి ఈ రోజు సాయంత్రానికి అధికారికంగా ఒక ప్రకటన వెలువడే అవకాశం వుంది.
ఈలోపు శివసేన శిభిరం కుడా బిజెపి తో కలసి అధికారం పంచుకొనే విషయంలో రెండు గా చీలీనట్టు వార్తలొస్తున్నాయి. ఒక వర్గం బిజెపి కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మంత్రి మండలి లొ బిజెపి తో కలసి అధికారం పంచుకోవాలని డిమాండ్ చేస్తున్నట్టు ఇంకొ వర్గం మాత్రం 50:50 ఫార్ములా కే మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఇదే కనుక జరిగితే ఈ మధ్య లో శివసేన లో నిలువునా చిలిక రావడం ఖాయం. ఆదే కనుక జరిగితే బిజెపి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి మార్గం సుగమం అయినట్టే!! మళ్లీ ఉప ఎన్నికలు జరిగే అవకాశం అయితె ఉండకపోవచ్చు!! ఒకవేళ మళ్లీ ఎన్నికలే కనుక జరిగితే ఈసారి కాంగ్రెస్ - రాష్ట్రవాది కాంగ్రెస్(NCP) కూటమి లాభపడడం ఖాయం!!