ఇదే నీ జీవితమా జగనూ..!

Saturday, May 2, 2020 05:49 PM Politics
ఇదే నీ జీవితమా జగనూ..!

సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ఒక పార్టీ అధికారం కోల్పోయి మరో పార్టీ ఆధికారంలోకి వస్తే గత ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై, బకాయిలు చెల్లించటానికి అధికారంలోకి ఉన్న ప్రభుత్వం ఆసక్తి చూపదు. కానీ జగన్ సర్కార్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు హయాంలో చెల్లించని బకాయిలను చెల్లించటంతో పాటు ఐదారేళ్ల నుంచి చెల్లించాల్సిన బకాయిలను సైతం చెల్లిస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది.

తాజాగా సీఎం జగన్ చిన్న, మధ్య తరహా పరిశ్రమల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 2014 నుంచి చెల్లించాల్సిన బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

 కరోనా కష్ట కాలంలో పరిశ్రమలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అధికారులు మే నెలలో కొంత మొత్తం, జూన్ నెలలో కొంత మొత్తం బకాయిలను చెల్లించనున్నారు.

జగన్ సర్కార్ చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరట కలిగేలా మరో నిర్ణయం కూడా తీసుకుంది. ఆ పరిశ్రమలకు 185 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలను రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేసింది. 

పరిశ్రమలను కరోనా నుంచి కాపాడేందుకు జగన్ సర్కార్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వం చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 905 కోట్ల రూపాయలు చెల్లించనుంది.

చంద్రబాబు ఐదేళ్ల నుంచి పెండింగ్ లో పెట్టిన బకాయిలను జగన్ సర్కార్ చెల్లించాలని తీసుకున్న నిర్ణయంపై సూక్ష, మధ్య తరహా పరిశ్రమల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

2018 - 2019 సంవత్సరానికి ఖరీఫ్ కింద బాబు ప్రభుత్వం చెల్లించాల్సిన 1100 కోట్ల రూపాయలను కూడా జగన్  సర్కార్ ఇటీవల విడుదల చేసింది. 

చంద్రబాబు హయాంలో చెల్లించాల్సిన ఫీజ్ రీఎంబర్స్మెంట్ లోటు 1800కోట్ల రూపాయలను జగన్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. చంద్రబాబు చెల్లించాల్సిన బకాయిలను జగన్ ప్రభుత్వం తీరుస్తూ ఉండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

For All Tech Queries Please Click Here..!
Topics: