వైసీపీ ఎమ్మెల్యే బావకు కరోనా, గుంటూరులో ‘రెండో దశ’ అలర్ట్

Friday, March 27, 2020 07:37 PM Politics
వైసీపీ ఎమ్మెల్యే బావకు కరోనా, గుంటూరులో ‘రెండో దశ’ అలర్ట్

గుంటూరు సిటీ మంగళదాసునగర్‌లో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో జిల్లా ఒక్కసారే ఉలిక్కిపడింది. సదరు బాధితుడు అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేకు దగ్గరి బంధువని తేలడం, వైరస్ నిర్ధారణకు ముందు అతను భారీ విందులో పాల్గొనడంతో సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడు ఈనెల 18న ఢిల్లీ నుంచి ఏపీకి రైలులో ప్రయాణం చేశాడు. జనతాకర్ఫ్యూ రోజైన ఆదివారం 500 మందితో కలిసి విందులో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు విషయంలో సీరియస్ గా వ్యవహరించాలని సీఎం అదేసించారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: