పార్లమెంట్ స్థానాల ప్రకారం జిల్లాలను విభజిస్తే ఒంగోలు జిల్లా పరిస్థితి ఇది..

Thursday, July 16, 2020 11:46 AM Politics
పార్లమెంట్ స్థానాల ప్రకారం జిల్లాలను విభజిస్తే ఒంగోలు జిల్లా పరిస్థితి ఇది..

వచ్చే మార్చి లోగా కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నెపధ్యంలో నిన్న జరిగిన క్యాబినెట్ భేటీ లో కొత్త జిల్లాల ఏర్పాటు పై అధ్యాయనానికి ఒక కమిటీని ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న తరుణంలో ఈ కమిటీ ప్రజల నుండి వస్తున్న విజ్నప్తులను పరిశీలించి శాస్త్రీయంగా అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకొని కొత్త జిల్లాల ఏర్పాటుపై ఒక సమగ్ర నివేదికని ప్రభుత్వానికి ఇస్తుందని భావిస్తున్నా

అలా కాకుండా ఇప్పుడున్న పార్లమెంటరి స్థానాలలో ఎలాంటి మార్పులు చేర్పులు చెయ్యకుండా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే చాలా చోట్ల ప్రజల నుండి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఆసలు మనం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూందే పరిపాలనా సౌలభ్యం కోసం ఐనప్పుడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కొద్దిపాటి మార్పులు చెయ్యకపోతే.. అనుకున్న లక్ష్యం నెరవెరకపోగా మొదటికే మోసం వస్తుంది. దానివల్ల జగన్ మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకొని ఆచితూచి అడుగేయాల్సి ఉంటుంది.

ఉదాహరణ కు మా ప్రకాశం జిల్లానే తీసుకుంటే.. ఇప్పుడున్న పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా జిల్లాను విభజిస్తే.. 

ప్రకాశం జిల్లాకు ప్రధానంగా ఆదాయం సమకూర్చే చీమకుర్తి గెలాక్సీ గ్రానైటు పరిశ్రమతోపాటు బల్లికురవ మార్టూరు గ్రానైట్ మొత్తం బాపట్ల జిల్లా పరుధిలొకి వెళ్తుంది..

అదే విధంగా యావత్ ప్రకాశం జిల్లాకే తలమానికం అయిన ఒంగోలు విజయా డైరీ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఒంగోలు కు పేరుప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన ఒంగోలు జాతి బ్రీడ్ పరిరక్షణ కోసం చదలవాడలో ఏర్పాటు చేసిన ఒంగోలు జాతి పశుసంరక్షణా కెంద్రం కూడా బాపట్ల కిందకే పోతుంది..

దానితో పాటు జిల్లాలోనే పెద్దదైన మల్లవరం గుండ్లకమ్మ డ్యాం.. రామతీర్ధమ్ జలాశయం.. నాగార్జున సాగర్ నుండి జిలాకు ప్రధానంగా నీరు వచ్చే ఆద్దంకి బ్రాంచ్ కెనాల్.. కృష్ణా డెల్టా పరిధిలో ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చే కొమ్మమూరు కాలువ.. సారవంతమైన తూర్పు ప్రాంతం మొత్తం బాపట్ల పరిధిలోకే వస్తుంది 

వస్త్ర వ్యాపారంలో రాష్ట్రంలోనే మంచి పేరుతో పాటు చిన్న బొంబాయిగా పిల్చుకొనే చీరాల పట్టణంతో పాటు ఎ గ్రెడ్ పొగాకు పండే సారవంతమైన నాగులుప్పలపాడు.. వెల్లంపల్లి మద్దిపాడు ప్రాంతాలు.. జిల్లాలోనే పెద్ద పారిశ్రామిక వాడ ఐన గుళ్లాపల్లి గ్రోత్ సెంటర్ (APIIC SEZ) కూడా బాపట్ల కిందకే పొవాల్సి వుంటుంది. 

ఇక కందుకూరు పట్టణం తో పాటు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో పొగాకు కంపెనీలు ఎక్కువగా ఉన్న సింగరాయకొండ.. మాగుంట సబ్బరామిరెడ్డి లిక్కర్ ఫ్యాకరీ.. రామాయపట్నం ఒడరేవు.. ఉలవపాడు మామిడి.. ఇలా అన్నీ నెల్లూరు పరిధిలోకి పోతాయి..

ఇవన్నీ పోయాక ఇక ఒంగోలు జిల్లాకు మిగిలేది కలేక్టరేటు కనిగిరి ఫ్లోరైడు వలసలు కరువు కాటకాలు ఆఖరికి మాహాశయుడు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి స్వగ్రామం వినోదరాయుని పాలెం కూడా బాపట్ల పరిధిలోకి పోతే.. ఇక ప్రకాశం జిల్లా పేరులోని ఆ కాస్త "ప్రకాశం" కుడా మిగలదేమో.

శ్రీధర్ రెడ్డి ...

For All Tech Queries Please Click Here..!
Topics: