టీడీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ..!

Friday, January 24, 2020 11:33 AM Politics
టీడీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ..!

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులపై దాఖలైన పిటిషన్లను ప్రస్తుత దశలో విచారణకు స్వీకరించడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ బిల్లులపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.బిల్లుల్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలన్న వ్యాజ్యాలపై ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా మండలిలో బుధవారం జరిగిన పరిణామాల గురించి ఆరాతీసింది. అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ సమాధానమిస్తూ.. బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతూ చైర్మన్‌ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

దీనికి ధర్మాసనం స్పందిస్తూ, సెలెక్ట్‌ కమిటీ నిర్ణయం వెలువరించేంత వరకు వేచిచూడాలని పిటిషనర్లకు స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీం సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ స్పందిస్తూ.. బిల్లులు ఇంకా చట్టరూపం దాల్చలేదని.. వాటిని సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాలు అపరిపక్వమైనవని వివరించారు. బిల్లులు సెలెక్ట్‌ కమిటీకి పంపిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణ గురించి బిజినెస్‌ రూల్స్‌ ఏం చెబుతున్నాయని ధర్మాసనం ప్రశి్నంచింది. సెలెక్ట్‌ కమిటీ నిర్ణయం తీసుకునేందుకు మూడు నెలల గడువు ఉందని రోహత్గీ వివరించగా.. అందుకే అప్పటి వరకు ఆగాలని పిటిషనర్లకు సూచించింది.  

For All Tech Queries Please Click Here..!
Topics: