సీఎం జగన్‌కు హైకోర్టు భారీ జలక్, జీవోలు రద్దు.

Wednesday, April 15, 2020 02:55 PM Politics
సీఎం జగన్‌కు హైకోర్టు భారీ జలక్, జీవోలు రద్దు.

ముఖ్యమంత్రి జగన్ నిర్ణయానికి హైకోర్టు బ్రేకులు వేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఏపీలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపైన రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది, ప్రతిపక్ష పార్టీలతో పాటు పలువురు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. అదే స్థాయిలో వారిపైన ముఖ్యమంత్రి జగన్‌తో సహా అధికార పార్టీ నేతలు సైతం గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో సహా కొందరు పత్రికాధిపతులపైన సీఎం జగన్ విరుచుకుపడ్డారు.

పేదల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు వద్దా అని జగన్ ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. ఏది ఏమైనా తాము మాత్రం ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. అదే సమయంలో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంగ్లీష్ మీడియంలో చదువులు లేకపోతే ప్రస్తుత పోటీ యుగంలో పిల్లలు రాణించలేరన్నది అధికార పార్టీ నేతల వాదన . తొలి విడతలో భాగంగా ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియం అమలు చేస్తూ వచ్చే ఏడాది నుంచి సంవత్సరానికి ఒక తరగతి చొప్పున ఇంగ్లీష్ మీడియం బోధనను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల ద్వారా విద్యార్థులు నష్టపోతారని టీచర్స్ నైపుణ్యం పెంచకుండా ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తే నష్టం జరుగుతుందంటూ బీజేపీ నేత సుధీష్ రాంబొట్లతో పాటుగా న్యాయవాది ఇంద్రనీల్‌ కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టుని అభ్యర్థించారు. మాధ్యమం ఎంపిక అవకాశాన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రులకే ఉండేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ జారీ చేసిన రెండు జీవోలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

For All Tech Queries Please Click Here..!
Topics: