వల్లభనేని వంశీ తాను అనుకున్నది సాదించాడు..!
గత ఎన్నికలలో గన్నవరం లో తెలుగుదేశం పార్టీ నుండి శాసనసభ్యుడిగా ఎన్నికైన వల్లభనేని వంశీ కొంతకాలం నుండి దూరం గా ఉంటున్నారు అంటే కాకుండా అయన మన రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కలిశారు.ముఖ్యమంత్రి ని కలిసిన తర్వాత అయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఐన చంద్రబాబు నాయుడు మరియు అయన కుమారుడు నారా లోకేష్ మీద అనేక వ్యాఖ్యలు చేసారు. వంశీ లోకేష్ ని ఎక్కువ గా టార్గెట్ చేసారు పప్పు అని డైరెక్ట్ గా అన్నాను,జయంతి కి వర్ధనతి కి తేడా తెలియని వాడికి పార్టీ అప్పచెప్పి పార్టీ ఐ నాశనం చేసారు అని అన్నారు అంతే కాకుండా లోకేష్ మరియు దేవినేని ఉమా తనని చాలా ఇబందులు పెట్టారు అని చెప్పారు . 2009 ఎన్నికల సమయం లో జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకువచ్చి ప్రచారం చూపించుకుని ఇపుడు తన కుమారుడు నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీ కి దూరం చేసారు అని చెప్పారు.
ఇలా ఆరోపణలు చేసిన తర్వాత తాను త్వరలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరతాను అని చెప్పారు. కానీ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కి ఒక సిదాంతం ఉంది వేరే పార్టీ నుండి ఎవరు వచ్చిన ఆ పార్టీ కి, ఆ పార్టీ వాక్=లన వచ్చిన పదవికి రాజీనామా చేసి రావాలి.ఇక్కడ వంశి చాలాతెలివిగా ఆలోచించారు తాను తన పదవికి రాజీనామా చేస్తే వైస్సార్ కాంగ్రెస్ మాలి తనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందో లేదో అని కొని రోజులు సైలెంట్ గా ఉన్నారు.ఇదే సమయం లో రాజ్యాంగం లో ఉన్న ఒక విషయాన్ని ఉపయోగించారు వంశీ ఒక శాసన సభ్యుడిని ఆ పార్టీ సస్పెండ్ చేస్తే ఆ ఎమ్మెల్యే స్వతంత్ర ఎమ్మెల్యే అవుతాడు. ఇది తెలుసుకున్న వంశీ తన ఆరోపణలు మరింత తీవ్రం చేసారు ఈ వ్యాఖ్యలు చూసినా తెలుగుదేశం పార్టీ వంశీ ని పార్టీ నుండి సస్పెండ్ చేసింది
శీతాకాల సమావేశాలు మొదలైన తర్వాత అసెంబ్లీ స్పీకర్ ని రిక్వెస్ట్ చేసారు తెలగుదేశం పార్టీ నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది అందువలన నన్ను స్వతంత్ర ఎమ్మెల్యే గా పరిగణించండి అని కోరడంతో స్పీకర్ వల్లభనేని వంశీ ని స్వతంత్ర ఎమ్మెల్యే గా గుర్తుస్తూ తనకి వేరే సీట్ ని కేటాయిచిమ్మని ఆదేశించారు.
ఇపుడు వల్లభనేని వంశీ ఒక స్వతంత్ర ఎమ్మెల్యే, తనకి మరి ఏ ఇతర పార్టీ కి సంబంధం లేదు.ఇపుడు వల్లభనేని వంశీ వైస్సార్ కాంగ్రెస్ లో చేరడానికి అటువంటి ఇబందులు లేవు అంటే కాకుండా రాజీనామా చేయాల్సిన అవసరం కూడా లేదు. వల్లభనేని వంశీ తాను అనుకున్నది సాధిచాడు