కరోనా సోకిన వారికి రూ. 10 వేలు, క్వారంటైన్‌లో ఉంటే రూ. 3 వేలు
ప్రభుత్వ విప్, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అందరూ భయపడుతున్న వేళ కరోనా బాధితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. కరోనా వైరస్ సోకిన వారికి రూ.10వేలు, క్వారంటైన్‌కు వెళ్లాల్సి వస్తే వారికి రూ.3వేలు సాయం చేస్తానని ప్రకటించారు. దీనికి సంబంధించి తొలివిడుతగా రూ.25 లక్షల చెక్‌ను అందజేశారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ద్వారా పద్మావతి క్వారంటైన్ సెంటర్‌కు అందజేశారు.
కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందించిన తర్వాత వారు కోలుకుని ఇంటికి వెళ్లే సమయంలో ప్రభుత్వం రూ.2వేలు అందిస్తోంది. దానికి అదనంగా చెవిరెడ్డి మరో రూ.10వేలు అందిస్తారు. అలాగే, ఒక కుటుంబంలో ఒకరికి కరోనా సోకితే, వారి కుటుంబంలో ముగ్గురు, లేదా నలుగురు క్వారంటైన్‌కు వెళ్లాల్సి వస్తుంది. వారికి ఒక్కొక్కరికి రూ.3వేల చొప్పున సాయంచేస్తానని చెవిరెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చిన దానికి ఇది అదనం అని స్పష్టం చేశారు.