కేసులు నుంచి తపించుకోవడానికి బాబు ప్లాన్, బీజేపీలోకి బాబు కోవర్టులు!

Friday, June 21, 2019 01:30 PM Politics
కేసులు నుంచి తపించుకోవడానికి బాబు ప్లాన్,  బీజేపీలోకి బాబు కోవర్టులు!
  • కేసుల భయంతో చంద్రబాబు కొత్త నాటకం
  • పక్కా వ్యూహంతోనే కమలం గూటికి టీడీపీ రాజ్యసభ సభ్యులు
  • నలుగురు రాజ్యసభ సభ్యులు జంప్‌
  • వెళ్లిన నలుగురూ చంద్రబాబు సన్నిహితులు, వ్యాపారవేత్తలే
  • కమలం గూటికి సుజనా, రమేశ్‌, టీజీ, గరికపాటి
  • బీజేపీలో చేరి ‘బాస్‌’ కోసం పనిచేసే వ్యూహం
  • బీజేపీలో విలీనమవుతూ వెంకయ్యకు లేఖ
  • బాబు తీరుపై మండిపడుతున్న మెజార్టీ టీడీపీ నేతలు

ఓవైపు ఎన్నికల్లో ఘోర పరాజయం, మరోవైపు కేసుల భయంతో టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సరికొత్త రాజకీయ నాటకం మొదలుపెట్టాడు. టీడీపీ రాజ్యసభ సభ్యులు తన అనుచరులు నలుగురిని తన కోవర్టులుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి వ్యూహాత్మకంగా పంపించారు. అదీ చంద్రబాబుకు వ్యక్తిగతంగా అత్యంత సన్నిహి తులైన ఎంపీలే బీజేపీలో చేరడం గమనార్హం. కేసుల నుంచి తనను కాపాడేందుకే చంద్రబాబు సొంత మనుషులను పక్కా వ్యూహంతో బీజేపీలోకి పంపారని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.

గత ఐదేళ్లుగా సాగించిన తన అవినీతి వ్యవహారాలపై విచారణ జరుగుతుందని చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. దీంతో తన మనుషులు బీజేపీలో ఉండటం అవసరమని పక్కాగా కథ నడిపించారు. అయితే చంద్రబాబు రాజకీయ పన్నాగం బెడిసికొట్టడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించు కుంది. తన స్వార్థం కోసం పార్టీ పుట్టి ముంచారని టీడీపీ నేతలు, శ్రేణులు ఆయనపై మండిపడ్డారు. గురువారం కాకినాడలో సమావేశమైన కాపు నేతలు తాజా పరిణామాలపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.