బయటపడ్డ బాబుగారి మరో కుట్ర, జేసీ దివాకరరెడ్డి పైన కోపంగా ఉన్న వైసిపీ..

Sunday, January 19, 2020 10:15 AM Politics
బయటపడ్డ బాబుగారి మరో కుట్ర, జేసీ దివాకరరెడ్డి పైన కోపంగా ఉన్న వైసిపీ..

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన పథకం ప్రకారం తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా వ్యాఖ్యలు చేయిస్తున్న చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక, అనైతికంగా పాచికలు పన్ని, కొంతమంది రెడ్డి, బీసీ సామాజిక వర్గ తెలుగుదేశం నాయకులను ఉపయోగించి. వారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిపై భారతీయ జనతా పార్టీ అధిష్టానం కోపంతో ఉన్నట్లు, అందువల్ల ఆయన్ని జైలుకు పంపించబోతున్నారు అంటూ వ్యాఖ్యలు చేయిస్తున్నారు. ఇంకో అడుగు ముందుకేసి, శ్రీమతి భారతి రెడ్డి గారు తదుపరి ముఖ్యమంత్రిగా చేపడుతారు అంటూ వ్యాఖ్యలు చేస్తూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలలో ఒక రకమైనటువంటి అనుచిత స్థితి తెచ్చే దానికోసం ఈ దుశ్చర్యకు తెలుగుదేశం పార్టీ వారు నడుం బిగించారు.

వీరికి భజన చేస్తున్నటువంటి పచ్చ మీడియా ఈ మొత్తాన్ని భుజస్కంధాల మీద వేసుకుని, ఏదైతే ఆ నాయకులు వ్యాఖ్యలు చేశారో, వాటిని పెద్ద ఎత్తున ప్రచురిస్తూ కుటిల రాజకీయాలు చేస్తున్నాయి. ఇలా పచ్చ మీడియా ప్రచురించిన వార్తను తెలుగుదేశం సోషల్ మీడియా వైరల్ చేస్తూ దుష్ప్రచారం చేస్తూ ఉంది. ఆంధ్ర ప్రజలరా తస్మాత్ జాగ్రత్త, ఇది తెలుగుదేశం యొక్క కల్పితం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ఇబ్బంది లేదు. భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి జగన్మోహన్ రెడ్డి గారికి స్నేహపూరితమైన వాతావరణంలో అభివృద్ధి దిశగా ఆంధ్ర రాష్ట్రం ముందుకు సాగుతోంది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో ప్రథమంగా ఉండబోతుంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: