ఘోరం, భారీ ట్రక్కులో 64 మృత దేహాలు

Thursday, March 26, 2020 05:51 PM Offbeat
ఘోరం, భారీ ట్రక్కులో 64 మృత దేహాలు

మొజాంబిక్ లోని వాయువ్య టేటే ప్రావిన్స్ లో జరిగింది ఓ దారుణం. ఓ కార్గో కంటెయినర్ (భారీ ట్రక్కు) లో 64 మృత దేహాలను పోలీసులు కనుగొన్నారు. ఆ డెడ్ బాడీస్ మధ్య 14 మంది సజీవంగా.. దిక్కుతోచని స్థితిలో కనబడి వారు షాక్ తిన్నారు. ఈ రాష్ట్ర సరిహద్దుల్లో మలావీ నుంచి వస్తున్న ఈ వాహనాన్ని పోలీసులు, ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆపివేసి తనిఖీ చేసినప్పుడు ఈ ఘోరం కనబడింది. సరిహద్దుల్లోని జింబాబ్వే నుంచి వఛ్చిన ఇథియోపియన్లుగా వీరిని భావిస్తున్నారు. ఈ వాహనంలో కిక్కిరిసి ఉన్నట్టు కుక్కిన వీరు శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఈ కంటెయినర్ డ్రైవర్ ను, అతని అసిస్టెంటును పోలీసులు అరెస్టు చేశారు.

మొజాంబిక్ దేశంలోకి ఇథియోపియన్ల అక్రమ ఎంట్రీకి ఎవరు వీలు కల్పించారన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఈ వాహనంలో అనేకమంది ఇథియోపియన్లు ప్రయాణిస్తున్నట్టు దక్షిణాఫ్రికా లోని ఇథియోపియన్ ఎంబసీ ద్వారా తమకు సమాచారం అందిందని అడ్డిస్ అబాబాలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ట్రాజెడీ పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. సజీవంగా ఉన్నవారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉపాధికోసం పొట్ట చేతబట్టుకుని అనేకమంది ఇథియోపియన్లు దొంగచాటుగా మొజాంబిక్ దేశంలోకి ప్రవేశిస్తుంటారు. 

For All Tech Queries Please Click Here..!
Topics: