8 ప్యాంట్లు తొడుక్కొని అడ్డంగా బుక్కయిన వెనిజులా యువతి

Sunday, December 8, 2019 02:00 PM News
8 ప్యాంట్లు తొడుక్కొని అడ్డంగా బుక్కయిన వెనిజులా యువతి

వెనిజులాలో ఓ యువతి వస్త్ర దుకాణానికి వెళ్లింది. అక్కడ జీన్స్‌ ర్యాక్‌ వద్దకు వెళ్లి 8 ప్యాంట్లు తీసుకొని డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లి ఒకదాని మీద ఒకటి ధరించి చోరీ చేసేందుకు యత్నించింది. కాగా, యువతి ప్రవర్తనపై అనుమానం కలిగిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అడ్డగించి వాష్‌రూమ్‌కు తీసుకెళ్లారు. ఆమె వేసుకున్న ప్యాంట్‌ను విప్పమన్నారు. దీంతో సదరు యువతి ఒక్కొక్క ప్యాంట్‌ విప్పుతూ.. మొత్తం 8ప్యాంట్లను బయటికి తీయడంతో సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

దీనికి సంబంధించిన వీడియోనూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఫేస్‌బుక్‌లో షేర్‌ చేయడంతో 4.2 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ వచ్చాయి. ' ఈమె చోరీలు చేయడంలో చాలా నేర్పరి. కొంచెం అజాగ్రత్తగా వ్యవహరించి ఉంటే దర్జాగా బయటకు వెళ్లిపోయేదే' అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

For All Tech Queries Please Click Here..!