నా ముఖ్యమంత్రి ఎక్కడ అంటూ నిరసన?

Thursday, July 9, 2020 03:40 PM News
నా ముఖ్యమంత్రి ఎక్కడ అంటూ నిరసన?

బేగంపేటలోని ప్రగతి భవన్‌ నుంచి బయటకు వెళ్లే గేటు వద్దకు బైక్‌పై ఇద్దరు యువకులు వచ్చారు, వెనుక కూర్చున ఓ యువకుడు తన వెంట తెచ్చుకున్న ప్లకార్డును తీసుకుని ప్రగతి భవన్ గేటు వద్దకు చేరుకున్నాడు. కేసీఆర్‌ ఎక్కడ? ఆయన నా ముఖ్యమంత్రి ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం నా హక్కు అంటూ రాసిన ప్లకార్డును చూపుతూ నిరసన తెలిపాడు.

పోలీసులు ఈ విషయం తేరుకుని అక్కడకి వచ్చేలోపే బయట ఎదురుచూస్తున్న తన స్నేహితుని బైకుపై కూర్చుని పరారయ్యాడు. దీంతో పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వారిని పట్టుకునేందుకు పంజాగుట్ట పోలీసులు రంగంలోకి దిగారు. ప్రగతి భవన్‌ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు.

ఎట్టకేలకు వారిద్దరినీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని యూత్‌ కాంగ్రె్‌సకు చెందిన నాయకులుగా గుర్తించారు. ఒకరిని సైదాబాద్‌కు చెందిన కోట్ల లడ్డూపటేల్‌, మరొకరిని బీఎన్‌ రెడ్డి నగర్‌కు చెందిన సాయికుమార్‌గా గుర్తించారు.

For All Tech Queries Please Click Here..!
Topics: