కరోనా అంటించడానికి మత్తు కాయలతో పాకిస్తాన్ నుంచి వచ్చిన వ్యక్తి..!

Wednesday, April 29, 2020 01:20 PM News
కరోనా అంటించడానికి మత్తు కాయలతో పాకిస్తాన్ నుంచి వచ్చిన వ్యక్తి..!

చిత్తూరు జిల్లాలోని తొట్టంబేడు మండలంలో కల చియ్యవరం అనే గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. కరోనా మహమ్మారితో ప్రజలు అంతా భయాందోళనకు గురవుతున్న సమయంలో మంగళవారం రాత్రి ఓ గుర్తుతెలియని వ్యక్తి  చిన్న బ్యాగుతో గ్రామంలోకి ప్రవేశించాడు. నీవు ఎక్కడినుంచి వచ్చావని గ్రామస్తులు అడగగా అతని సమాధానం విని గ్రామస్తులు హడలిపోయారు.

నేను పాకిస్తాన్‌ నుంచి వచ్చినట్లు హిందీలో సమాధానం చెప్పాడు ఆ వ్యక్తి. తనతోపాటు మరో నలుగురు కూడా వచ్చినట్లు తెలిపాడు. అతను పాకిస్తాన్‌ నుంచి తమకు వైరస్‌ను అంటించేందుకు వచ్చినట్లుగా భావించిన జనం భయంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేశారు. అతని చేతిలో ఉన్న సంచిలో ఏవో కాయలు ఉన్నాయి. అవి మత్తు కాయలుగా భావించి జనం భయపడుతున్నారు. అతను పారిపోకుండా జనం చుట్టుముట్టారు. రాత్రి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: