మోడీకి ట్రంప్ వార్నింగ్, చిచ్చు పెట్టిన కరోనా (వీడియో).

Tuesday, April 7, 2020 08:35 AM News
మోడీకి ట్రంప్ వార్నింగ్, చిచ్చు పెట్టిన కరోనా (వీడియో).

కరోనా వైరస్ వైద్య చికిత్సలో వినియోగించే ఈ హైడ్రాక్సిక్లొరోక్విన్ డ్రగ్‌ను వెంటనే తమ దేశానికి పంపించాలని అలా పంపకపోతే ప్రతీకారం తప్పదని ట్రంప్ నేరుగా హెచ్చరించారు. తన అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమెరికాలో కరోనా వైరస్ భారీ విధ్వంసాన్ని సృష్టిస్తోందని, ఈ వైరస్ మిగిల్చిన దుష్ప్రభావాలు, పరిణామాలు సుదీర్ఘకాలం పాటు ఉంటాయని చెప్పారు. దీన్ని నివారించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

కరోనా పరిస్థితులను మెరుగుపర్చడానికి ట్రంప్ భారత్ మీదే పూర్తిగా ఆధారపడ్డారు. మనదేశం నుంచి ఎగుమతి అయ్యే యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సిక్లొరోక్విన్‌ను తమకు సరఫరా చేయాలంటూ రెండురోజుల కిందట ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అభ్యర్థించిన ఆయన స్వరంలో ఇప్పుడు మార్పు కనిపించింది. ఈ డ్రగ్‌ను తమ దేశానికి ఎగుమతి చేయాలని కోరుతూ భారత ప్రభుత్వాన్ని తాను ఇదివరకే విజ్ఙప్తి చేశానని గుర్తు చేశారు. రెండు రోజుల తరువాత కూడా భారత్ నుంచి తాను ఆశించిన సమాధానం రాలేదని చెప్పారు. అయినప్పటికీ.. ఫర్వాలేదని, దీనికి తప్పనిసరిగా ప్రతీకారం ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

For All Tech Queries Please Click Here..!
Topics: