ఐపీఎల్‌‌లో ప్యాట్ కమిన్స్‌ను ఎదుర్కొవాల్సి వస్తే: ప్రియమ్ గార్గ్

Thursday, May 7, 2020 09:20 AM News
ఐపీఎల్‌‌లో ప్యాట్ కమిన్స్‌ను ఎదుర్కొవాల్సి వస్తే: ప్రియమ్ గార్గ్

NO.4 స్పాట్ తన ఫేవరేట్ అని టీమిండియా అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా వ్వవహారించిన ప్రియమ్ గార్గ్ తెలిపాడు. బుధవారం Helo యాప్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియమ్ గార్గ్ అనేక విషయాలను పంచుకున్నాడు. ప్రముఖ జర్నలిస్ట్ అనుపమ్ పాండే అడిని పలు ప్రశ్నలకు ప్రియమ్ గార్గ్ సమాధానమిచ్చాడు. లాక్ డౌన్‌లో గత నెల రోజులు నుంచి కుటుంబంతో గడపడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. ప్రస్తుతం ఫిట్‌నెప్‌పై దృష్టి సారిస్తున్నానని తెలిపాడు. ఇందులో భాగంగా సాయంత్రం సమయంలో శిక్షణ ప్రారంభిస్తున్నానని... వారంలో మూడు సార్లు యోగా చేస్తున్నట్లు గార్గ్ చెప్పాడు. ఐపీఎల్ అనేది యువ ఆటగాళ్లకు సరైన వేదిక అని చెప్పిన గార్గ్.... దీంతో ఎంతో మంది విదేశీ ఆటగాళ్లను కలిసే అవకాశం లభిస్తుందని తెలిపాడు. ఐపీఎల్‌లో రాణిస్తే జాతీయ జట్టులో ఆడేందుకు అవకాశం లభిస్తుందని తెలిపాడు. ఈ ఏడాది ఐపీఎల్ అక్టోబర్ లేదా నవంబర్‌లో జరిగే అవకాశం ఉందని తాను భావిస్తున్నట్లు గార్గ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌లో ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్‌ను ఎదుర్కొవాల్సి వస్తే తన వ్యూహాం ఏంటన్న ప్రశ్నకు గాను తాను బౌలర్ ఎవరో చూడనని అన్నాడు. ఏదైనా ఫేవరేట్ టీమ్ ఉందా అన్న ప్రశ్నకు గాను అలాంటిది ఏమీ లేదని చెప్పాడు. ప్రస్తుతం తాను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో సంతోషంగా ఉన్నానని తెలిపాడు. ఐపీఎల్‌తో విదేశీ ఆటగాళ్లతో పంచుకునే అవకాశం నాతనకు లభిస్తుందని తెలిపాడు. తాను ఎల్లప్పుడూ అత్యుత్తమ ప్రదర్శనే ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని గార్గ్ అన్నాడు. టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ప్రతి ఆటగాడికి ఆదర్శంగా నిలుస్తాడని తెలిపాడు. 

ర్యాపిడ్ పైర్ క్వశ్చన్స్:
a. ఇష్టమైన క్రికెటర్ - సచిన్
b. SRHలో ఏ సంఖ్య బ్యాటింగ్ చేస్తారు? - జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది( NO.4 అంటే ఇష్టం) 
c. ఇష్టమైన బౌలర్ - బుమ్రా
d. అండర్-19 జట్టులో ఇష్టమైన క్రికెటర్? - అందరూ ఇష్టమే, ప్రత్యేకంగా ఉంటే శుభమాన్ గిల్
e. సచిన్‌ను కలిసే అవకాశం వచ్చిందా? -  ఇంకా లేదు
f. విరాట్ లేదా ధోనీలలో ఎవరిని ఎంచుకుంటారు? - ధోని
g. చైనీస్/ఇటాలియన్ / ఇండియన్ ఫుడ్ ఏదంటే ఇష్టం - ఇండియన్ పుడ్
h. ఫేస్‌బుక్ /ఇన్‌స్టాగ్రామ్ - ఇన్‌స్టాగ్రామ్
i. డబ్బు లేదా గౌరవం - గౌరవం

For All Tech Queries Please Click Here..!
Topics: