గుంటూరు జిల్లా యడ్లపాడు వద్ద ప్రెవేటు బస్సు బోల్తా : 12 మందికి గాయాలు

Tuesday, February 25, 2020 10:33 AM News
గుంటూరు జిల్లా యడ్లపాడు వద్ద ప్రెవేటు బస్సు బోల్తా : 12 మందికి గాయాలు

గుంటూరు జిల్లా యడ్లపాడు సమీపంలో సోమవారం ఉదయం 7 గంటల నమయంలో ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడడంతో 12 మందికి గాయాల య్యాయి. బెంగళూరు నుంచి విజయవాడకు అత్యంత వేగంగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ ప్రమాదానికి గురి అయింది. ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డైవర్లతో పాటు 28 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు యడ్లపాడు వద్ద హైవే వంతెన పైకి ఎక్కుతుండగా, ముందు వెళ్తున్న పొగాకు లోడు ట్రాక్టర్‌ను తప్పించే ప్రయత్నంలో సడన్‌ బ్రేక్‌ వేయడంతో ప్రమాదం సంభవించింది. బస్సు డివైడర్‌ మధ్యలో ఉన్న రెయిలింగ్‌ గడ్డర్లను ఢీకొని అవతల వైపు ఉన్న రోడ్డులోకి సుమారు 200 అడుగుల దూరం వెళ్లి బోల్తా పడింది.

రెయిలింగ్‌ గడ్డర్లు బస్సులో ఇరుక్కుని బస్సు వేగాన్ని కొంతవరకు ఆపాయి. లేదంటే బన్సు వంతెన పైనుంచి కింద సర్వీను రోడ్డుపైకి పడుంటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఈ ప్రమాదంలో ఇద్దరు డైవర్లతో పాటు 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: